Sunday, December 22, 2024

సెప్టెంబర్‌లో మూడో వారంలో టెట్ పరీక్షల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
త్వరలో నోటిపికేషన్

హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సెప్టెంబర్ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి) నిర్ణయించింది. వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నది.ఈ మేరకు టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌సిఇఆర్‌టి అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగో సారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4 సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు టెట్ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంతో కలిపి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహించారు. 2017 జూలై 23న టెట్ నిర్వహించగా, చివరి టెట్ గత ఏడాది జూన్ 12న నిర్వహించారు. రాష్ట్రంలో టెట్ పరీక్షకు సుమారు 3 లక్షలపైగానే అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన టెట్ పేపర్ 1కు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News