Thursday, January 23, 2025

టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్ 15వ తేదిన జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్..2023 పరీక్షల ఏర్పాట్లతో అదనపు కలెక్టర్ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. టెట్ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్దులు కావాలన్నారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజన్లలో పరీక్షలు నిర్వహించనున్నామని వివరించారు.

ఈ నెల 15వ తేదిన నిర్వహించే పరీక్షలో పేపర్.1, పేపర్‌_2 ఉంటాయని వివరించారు. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, 17 పరీక్షా కేంద్రాలలో 3845 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అలాగే పేపర్. 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 15 పరీక్షా కేంద్రాలలో 3242 మంది విద్యార్థుఉ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కోన్నారు. మొత్తంగా 7087 మంది టెట్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల భద్రత కోసం పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు, ప్రశ్న పత్రాలకు రెవెన్యూ, విద్యా శాఖల సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయని ఆదేశించామన్నారు.

పరీక్షల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల నిర్వహణకు విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ జరిగే విదంగా, మునిపాలిటీ నుంచి శానిటేషన్, తాగునీటి సరపఱా, మరుగుదొడ్ల నిర్వహణ ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటుతో పాటు గాలి, వెలుతురు ఉండే విధంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని ఆయన వివరించారు.

సెల్ ఫాన్లకు అనుమతి లేదని, అలాగే గాజులు, చెవిరింగ్‌లు, బూటుతో పరీక్షా కేంద్రాలకు అనుమతించబోరన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షా సమయాలను అనుసరించి ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. పరీక్షాల కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ సమన్వయ సమావేశంలో అదనపు ఎస్పీ చెన్నూరు చెన్నయ్య, ఆర్డీఓ అవివేలు, జిల్లా విద్యాశాఖాధికారి పి. రామారావు, నోడల్ అధికారులు సూర్యనారాయణ, సుధాకర్, ఆర్టీవో వెంకన్న, తొర్రూరు మున్సిపల్ కమీషనర్ సరస్వతి, విద్యుత్ శాఖ డీఈ సునీతదేవి, విద్యాశాఖాధికాలు శ్రీరాములు తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News