Thursday, November 14, 2024

టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ ప్రతినిధి: ఈ నెల 15వ తేదీన జిల్లాలోని 21 పరీక్షా కేంద్రాలలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడివోసీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయని, పేపర్-1కు 21 కేంద్రాలలోను, పేపర్-2కు 16 కేంద్రాలలోను ఉంటుందన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల రూట్లలో ఉదయం, సాయంత్రం అదనపు బస్సులు నడుపాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రవాణాశాఖాధికారి రిచర్డ్‌మిర్స్, డిఈవో రాధక్రిష్ణ, డిటివో సాయిలు, ఆర్డీసీ పీఆర్‌వో రమష్, జిల్లా సైన్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News