Thursday, December 19, 2024

టెట్ తో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు : ఎంఎల్‌సి బల్మూర్ వెంకట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంఎల్‌సి బల్మూర్ వెంకట్ తెలిపారు. డిఎస్‌సి కంటే ముందే టెట్ నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. దింతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షానే ఉంటుందనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజలు, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటుందని మరోసారి రుజువైందని ఆయనన్నారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News