Monday, December 23, 2024

టెక్సాస్ మాల్‌లో కాల్పులు: తొమ్మిదికి చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -
మరో ఏడుగురికి గాయాలు

హ్యూస్టన్: దక్షిణ మధ్య అమెరికా రాష్ట్రం టెక్సాస్‌లోని అవుట్‌లట్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో షూటర్‌తో సహా తొమ్మిది మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొల్లిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తి ఒంటరి అని, ఘటనాస్థలిలో మరణించడాని భావిస్తున్నారు.
అలెన్ ఫైర్ చీఫ్ జోనాథన్ బోయిడ్ శనివారం రాత్రి మాట్లాడుతూ, కనీసం తొమ్మిది మంది వ్యక్తులను ఆసుపత్రులకు పంపారు. ‘ఇద్దరు చనిపోయారు, ముగ్గురికి క్లిష్టమైన శస్త్ర చికిత్స జరుగుతోంది, మరో నలుగురి పరిస్థితి స్థిమితంగా ఉంది’ అని వివరించారు.

డల్లాస్‌కు ఉత్తరాన 48 కిమీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతంలోని అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్‌లో కాల్పులు జరిగాయి. స్థానిక నివాసితులు జిన్హువాతో మాట్లాడుతూ, ఆ ప్రాంతంలోని అతిపెద్ద అవుట్‌లెట్ మాల్స్‌లో ఒకటన్నారు. వారంతాల్లో ఆ మాల్ చాలా బిజీగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News