Sunday, January 19, 2025

హిందాల్కోతో టెక్స్‌మాకో భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్, రీసైక్లింగ్ కంపెనీ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రత్యేక ఇంజనీరింగ్ కంపెనీ టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ భాగస్వామ్యం లో భాగంగా భారతీయ రైల్వేలకు తమ ఉద్గార లక్ష్యాలు చేరుకోవటం, ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటం లో సహాయపడుతూ ప్రపంచ స్థాయి అల్యూమినియం రైల్ వ్యాగన్‌లు, కోచ్‌లను అభివృద్ధి చేయడం, తయారు చేయడం చేయనున్నాయి.

సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే “మిషన్ 3000 MT” ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యాగన్ డిజైన్‌ను మెరుగుపరచడానికి చురుకుగా ప్రయత్నిస్తుండటం తో పాటుగా మొత్తం మీద సామర్థ్యాన్ని, రైల్వే ఆస్తుల జీవిత కాలాన్ని పెంచడానికి అనువుగా తమ స్వంత డిజైన్‌లను అందించాల్సిందిగా వ్యాగన్ తయారీదారులను రైల్వే ఆహ్వానిస్తోంది.

రైల్వేలో ఈ పరిణామాలను గుర్తించిన , హిందాల్కో మరియు టెక్స్‌మాకో అవకాశాలను అన్వేషించడానికి చేతులు కలిపాయి, ఇక్కడ హిందాల్కో తమ ప్రత్యేకమైన అల్యూమినియం మిశ్రమాల ప్రొఫైల్‌లు, షీట్‌లు మరియు ప్లేట్‌లను ఫాబ్రికేషన్, వెల్డింగ్ నైపుణ్యంతో పాటు అందిస్తుంది. గత సంవత్సరం ప్రారంభించబడిన సంస్థ యొక్క అంతర్గత అల్యూమినియం ఫ్రైట్ రేక్ 180 టన్నుల లైటర్, టెర్ వెయిట్ రేషియోకి 19% అధిక పేలోడ్‌ను అందిస్తుంది, సాపేక్షంగా అతితక్కువ వేర్ అండ్ టియర్ తో తక్కువ శక్తిని వినియోగిస్తుంది. టెక్స్‌మాకో, 80 సంవత్సరాలుగా సరుకు రవాణా కార్స్ తయారీలో నైపుణ్యం కలిగిన సంస్థ. ఇది తమ సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకువస్తుంది. డిజైన్, ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు, నైపుణ్యం కలిగిన కార్మికులను అందించడానికి బాధ్యత వహిస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాయ్ మాట్లాడుతూ.. “భారతదేశం యొక్క మొట్టమొదటి అల్యూమినియం రేక్‌ను ప్రారంభించడంతో, అల్యూమినియం రేక్‌లు అందించే అధిక పేలోడ్, గణనీయమైన CO2 తగ్గింపు ప్రయోజనాలను మేము ప్రదర్శించాము. ఈ భాగస్వామ్యం సరకు రవాణా పరిశ్రమ, ప్రయాణీకుల మొబిలిటీ కోసం విలువ ప్రతిపాదనను పెంపొందించడంలో మా పాత్రను మరింత బలోపేతం చేస్తుంది, అదే సమయంలో రైల్వేలు దాని నెట్ జీరో లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి” అని అన్నారు.

టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ ఇంద్రజిత్ ముఖర్జీ మాట్లాడుతూ “ఈ విలువైన భాగస్వామ్యం వినూత్నమైన, స్థిరమైన ఉత్పత్తులను రూపొందించడంలో పరిశ్రమ యొక్క కార్బన్ పాదముద్రను తగ్గించడం, సానుకూల పర్యావరణ ప్రభావాన్ని పెంచడం పట్ల మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడంలో చాలా దోహదపడుతుంది” అని అన్నారు.

ఈ గణనీయమైన లాభాలు హిందాల్కో, టెక్స్‌మాకోలను ఆత్మనిర్భర్ భారత్ కలల సాధనలో పూర్తి స్థాయిలో ముందుకు సాగేలా ప్రోత్సహించాయి. ఆధునిక సౌకర్యాలతో మెరుస్తున్న కొత్త స్టేషన్‌లను నిర్మించడం, అలాగే అత్యాధునిక కోచ్‌లు మరియు మెట్రో రైలు నెట్‌వర్క్‌లో వేగవంతమైన విస్తరణ వంటి రెండు ప్రాథమిక మౌలిక సదుపాయాల పరంగా భారీ అప్‌గ్రేడేషన్‌లో ఉన్న రైల్వేలకు సహాయం చేశాయి.

టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్త ముఖర్జీ మాట్లాడుతూ.. “తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సమర్థవంతమైన రోలింగ్ స్టాక్‌ను పరిచయం చేయడంలో భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడంలో ఈ భాగస్వామ్యం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు. అధిక-నాణ్యత గల అల్యూమినియం వ్యాగన్‌లు, కోచ్‌లు, పెద్ద కంటైనర్‌లు, భాగాలను తయారు చేయగల స్వదేశీ సదుపాయం, సామర్థ్యం పెంచడానికి, సరుకు రవాణా సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ల యొక్క వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News