Monday, December 23, 2024

27నుంచి మార్కెట్‌లో పాఠ్య పుస్తకాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 27 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభు త్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ పాఠం ఆడియో, వీడియో రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఆయన తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగిత ధర, టెండర్లు ఖరా రు చేయడంలో ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై పదిహేను రోజులైనప్పటికీ పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ, విక్రయా ల కాంట్రాక్టును 13 ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు తెలియచేశారు. జిల్లా విద్యాధికారి నుంచి అనుమతి పొందిన విక్రయ కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు జరుగుతాయని వివరించారు. ప్రభు త్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధర వసూలు చేస్తే జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పాఠ్యపుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్, గైడ్లు, వర్క్ బుక్‌లు, ఇతర స్టేషనరీ కచ్చితంగా కొనాలని ఒత్తిడి చేసేవారిపై.. చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ శ్రీనివాసచారి స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News