Friday, August 30, 2024

నేటి నుంచి డిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం(జులై 18) నుంచి ఆగస్టు 5 వరకు 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, బుధవారం సాయంత్రం వరకు 2,48,851 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు సెషన్లలో డిఎస్‌సి పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో ఆరు సంవత్సరం తర్వాత డిఎస్‌సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5వ తేదీతో డిఎస్‌సి పరీక్షలు ముగియనుండగా, సెప్టెంబర్ చివరి నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. డిఎస్‌సి పరీక్షలు ముగిసిన ఆయా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి, వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ఆయా ప్రశ్నాపత్రాల తుది కీ ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు రెండు వారాలలో ముగియనుంది. ఈసారి ఆన్‌లైన్ విధానంలో డిఎస్‌సి నిర్వహిస్తున్నందున తుది కీ ఖరారైన వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే సెప్టెంబర్‌లో డిఎస్‌సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిఎస్‌సి 2024 పరీక్షల షెడ్యూల్

జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష
జులై 18 రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్‌జిటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్. స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
జులై 31న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ పరీక్ష
ఆగస్టు 1న ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
ఆగస్టు 2న లాంగ్వేజ్ పండిట్స్(తెలుగు), వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ పరీక్ష
ఆగస్టు 5న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News