Saturday, February 22, 2025

ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

25 నుంచి దరఖాస్తులు ఎస్‌సి ఉపకులాల వారీగా దరఖాస్తుల
స్వీకరణ ఏప్రిల్ 29,30 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా
విభాగం పరీక్షలు మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ వి భాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టి జి ఎప్‌సెట్(ఇఎపిసెట్) నోటిఫికేషన్ వి డుదలైంది. టిజిఇఎపిసెట్‌కు ఈనెల 25 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండ లి వెల్లడించింది. ఏప్రిల్ 4 వరకు ఎలాం టి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీ ల్లో అగ్రికల్చర్,ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నా రు. ఇఎపిసెట్‌కు ఈసారి ఇంటర్ మొద టి, ద్వితీయ సంవత్సరాల నుంచి 100 శాతం సిలబస్ తీసుకోవాలని సెట్ కమి టీ నిర్ణయించింది. ఇఎపిసెట్ పరీక్షలు జెఎన్‌టియుహెచ్ నిర్వహించనున్నది. రాష్ట్రంలో ఎస్‌సి వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్‌సెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలకు ఉపకులాల వా రీగా దరఖాస్తులను స్వీకరించాలని రా ష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది. అయితే ఇప్పటివరకు ఎస్‌సి వర్గీకరణపై మూడు గ్రూపులుగా కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌సి కేటగిరీకి చెందిన విద్యార్థులు వారి కులాన్ని ఆన్‌లైన్ దరఖాస్తులో పొందుపరిచేలా ఏర్పాట్లు చేశారు. దాని వల్ల ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ అమలు చేయడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. మిగతా ప్రవేశ పరీక్షలలోనూ ఇదే అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌సి విద్యార్థులకు ప్రవేశాల్లో 15 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఎస్‌సి కేటగిరీలో ఉపకులాలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయిస్తున్నారు. ఇటీవల ఎస్‌సిలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, అసెంబ్లీ, శాసనమండలి వర్గీకరణకు ఆమోదం తెలిపాయి. ఎస్‌సి వర్గీకరణకు సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత గ్రూపుల వారీగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.

ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు
సాధారణంగా ప్రవేశ పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా సెట్ కన్వీనర్ ప్రాథమిక కీ విడుదల చేసి, దానిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అయితే ఈసారి ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షలలో ప్రాథమిక కీ పై విద్యార్థులు అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు చెల్లించే విధానం అమలు చేయనునున్నారు. రూ.500 చెల్లించి విద్యార్థులు ప్రాథమిక కీ పై ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలియజేయాలి. అంటే ప్రవేశ పరీక్షల ప్రాథమిక ‘కీ’ అభ్యంతరాలపై ఇక నుంచి ఫీజులు వసూలు చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు. విద్యార్థి ఒక ప్రశ్నపై అభ్యంతరం సమర్పించిన అనంతరం ప్రాథమిక కీలో వెల్లడించిన సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.

ప్రాథమిక కీ లో మార్పులేకపోతే మాత్రం ఫీజు తిరిగి ఇవ్వరు. ఈ విధానం ఇప్పటికే జెఇఇ, నీట్ పరీక్షలలో అమలవుతున్నది. ఒక్కో ప్రశ్నపై అభ్యంతరాలకు రూ. 200 ఫీజుగా తీసుకుంటున్నారు.కొన్ని కాలేజీలు అనవసరంగా కావాలనే విద్యార్థుల చేత భారీగా అభ్యంతరాలు నమోదు చేయిస్తున్నట్టుగా సెట్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు చెల్లించే విధానం అమలు చేస్తే కొంత ఆలోచించి అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉన్నది. ఈ విధానం ద్వారా అనవసర అభ్యంతరాలు తగ్గి విలువైన అభ్యంతరాలు మాత్రమే వస్తాయని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News