Tuesday, January 7, 2025

పుష్ప2 మూవీ టికెట్ ధరల పెంపు..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప2’ టికెట్ ధరలు పెరగనున్నాయి. తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షోల టికెట్ ధరలు 800 రూపాయలుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఏపీలోనూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలని మేకర్స్ త్వరలోనే ప్రభుత్వాన్ని కోరనున్నారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పుష్పరాజ్ భార్య శ్రీవల్లీ పాత్రలో నేషనల్ క్రష్ రష్మికా మందన నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ఫుల్ జిజీగా ఉన్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ గా రికార్డు సేల్స్ తో పుష్ప 2 రిలీజ్ కు ముందే అదరగొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News