Thursday, December 19, 2024

22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వాటిని పరిశీలించి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసిందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి భవన్‌లలో శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్,

కామన్ వర్క్ షెడ్, ఉత్పత్తుల ప్రదర్శన, సరస్ మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 19న హన్మకొండ ఆర్ట్, సైన్స్ కాలేజీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలకు శంకు స్థాపన చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికి 10 జిల్లా కేంద్రాల్లోనే జిల్లా మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 22 జిల్లాల్లో జిల్లా మహిళా సమాఖ్యల కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

63 లక్షల ఎస్‌హెచ్‌జి సభ్యులు నెట్‌వర్క్
వివిధ జీవనోపాధి కార్యకలాపాల ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి విధానాన్నిఅమలు పరుస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 63 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులతో ఎస్‌హెచ్‌జిలు అతి పెద్ద నెట్‌వర్క్ కలిగి ఉందన్నారు. పొదుపు, బ్యాంకు లింకేజీ నుండి జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక సాధికారతతో పాటు సంపద సృష్టి జరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోందని వివరించారు. అందుకే స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం జిల్లా సమాఖ్య కోసం జిల్లాల ప్రధాన కార్యాలయంలో ఆఫీస్-కమ్-్ర టైనింగ్ భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News