Sunday, December 22, 2024

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన అనర్హత పిటిషన్లపై సోమవారం కోర్టు విచారించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే సుమోటోగా తీసుకుంటామని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరిలో ముందుగా వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News