Friday, November 8, 2024

టెట్ దరఖాస్తులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 రెండో సెషన్ దరఖాస్తుల స్వీకరణ గురువారం రాత్రి ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు టెట్ పూర్తి నోటిఫికేషన్ ను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా..సాంకేతిక కారణాలతో రెండు రోజులపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

టెట్ ఫీజును తగ్గిస్తామని గత పరీక్షకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఈసారి టెట్ ఫీజును ప్రభుత్వం తగ్గించింది. ఒక్క పేపర్ కు రూ.750, రెండు పేపర్లకు రూ.2 వేలుగా ఫీజు నిర్ణయించింది. గత టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఈసారి దరఖాస్తు ఫీజు లేకుండా పరీక్ష రాసే అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ వరకు టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News