Friday, January 17, 2025

టిజిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టిజి సెట్ 2024 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ఒయు విసి కుమార్‌తో కలిసి శనివారం విడుదల చేశారు. పరీక్షకు మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా, 26, 294 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,884 మంది(7.17 శాతం) అర్హత సాధించారు. టిజి సెట్‌లో అర్హత సాధించిన వారిలో మహిళా అభ్యర్థులు 49.79 శాతం కాగా, పురుషులు 50.21 శాతం మంది ఉన్నారు. ఫలితాలకోసం అభ్యర్థులు టిజి సెట్ అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.orgలో చూసుకోవచ్చని సభ్యకార్యదర్శి నరేష్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయటం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్ నుంచి డౌల్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా ఒయు వైస్ చాన్స్‌లర్ కుమర్ మొలుగారం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యారంగంలో బోధన చేసే అత్యంత నైపుణ్యం కలిగిన వారిన ఎంపిక చేయటంలో ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత ఉండేలా టిజి సెట్ బృందం, ఉస్మానియా విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిజి సెట్ 2024 ప్రక్రియలో భాగస్వాములైన పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్ శ్రీనివాస్, ఒయు సైన్స్ విభాగం డీన్ కరుణ సాగర్, విజయ, కెయు ప్రొఫెసర్ కె.రాజెందర్, మైసూర్ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య విభాగం ప్రొఫెసర్ కె. నాగేంద్రబాబు, యోగివేమన విశ్వవిద్యాలయ జియాలజీ విభాగం ప్రొఫెసర్ వి.సునిత పాల్గొన్నారు. వీరితో పాటు ఒయు విసి ఒఎస్‌డి జితేంద్ర కుమార్ నాయక్, మురళీకృష్ణ, శ్రీనగేశ్, కొండా నాగేశ్వర్, గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News