Monday, November 25, 2024

గురుకుల ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొపైటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్ లో విడుదల చేశారు. మొత్తం లక్షా 21 వేల 826 దరఖాస్తులు రాగా, ఏప్రిల్ 23న న నిర్వహించిన పరీక్షకు ఒక లక్షా 13 వేల 219 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 232 మంది,గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ లో 77 మంది, మహాత్మా జ్యోతిరావు పులె బీసి సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 146,

రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 35 సీట్లు భర్తీచేసినట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో 50 శాతం సీట్లు నియోజకవర్గ అభ్యర్దులతో నింపినట్లు అధికారులు చెప్పారు. తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ సంవత్సరం పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టినట్టు వివరించారు. అదనంగా ప్రతి ఇనిస్టిట్యూషన్ లో ఎనిమిది సీట్లు కల్పించినట్లు చెప్పారు. అర్హత కల్గిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News