Monday, December 23, 2024

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కలిసిన టీజీఓ సంఘం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: నూతన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తూము రవీందర్ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్లో నూతన జిల్లా కలెక్టర్‌ను జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు కలిసి సన్మానించారు.

జిల్లా పాలనలో అధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తామని తూము రవీందర్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో చిత్తశుద్దితో అధికారులు కృషి చేస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్‌లు వేణుగోపాల రావు, అలివేని, ఉపాధ్యక్షులు కవిత, రమేష్, ఈసీమెంబర్ శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News