Tuesday, February 4, 2025

సెట్‌లు ఖరారు

- Advertisement -
- Advertisement -

25 నుంచి ఎప్‌సెట్ దరఖాస్తులు
ఏప్రిల్ 29,30 తేదీలలో
అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు
మే 2 నుంచి 5వ తేదీ వరకు
ఇంజనీరింగ్ విభాగం పరీక్ష
ప్రవేశ పరీక్షల ‘కీ’పై అభ్యంతరాలకు
జెఇఇ, నీట్ తరహాలో ఫీజు చెల్లింపు విధానం ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం ప్రాథమిక కీ సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు వాపస్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్‌సెట్ (ఇఎపిసెట్)తో సహా టిజి ఐసెట్, టిజి పిజిఇసెట్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఆయా సెట్ల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి వేరువేరుగా ప్రకటించింది. టిజిఇఎపిసెట్‌కు ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఏప్రిల్ 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.

ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇఎపిసెట్‌కు ఈసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి 100 శాతం సిలబస్ తీసుకోవాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఇఎపిసెట్ నిర్వహణకు సంబంధించి జెఎన్‌టియుహెచ్‌లో సోమవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జెఎన్‌టియుహెచ్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్‌ను ప్రకటించాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టిజిఇఎపిసెట్ షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 20
అన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు(ఆలస్య రుసుం లేకుండా)
అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు : ఏప్రిల్ 29,30 తేదీలలో
ఇంజనీరింగ్ విభాగం పరీక్ష : మే 2 నుంచి 5వ తేదీ వరకు
టిజిఐసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల: మార్చి 6
ఆన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 10 నుంచి మే 3 వరకు (అలస్య రుసుం లేకుండా)
దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ రూ.750, ఎస్‌సి,ఎస్‌టి,వికలాంగులకు రూ.550
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జూన్ 8, 9 తేదీల్లో రెండు సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మొదటి సెషన్, మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్
పిజిఇసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల -: మార్చి 12
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 17 నుంచి మే 19 వరకు (ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేదీ : జూన్ 16 నుంచి 19వరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News