Monday, April 28, 2025

ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేసిన టిజిపిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 నిమాయకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ.. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. టిజిపిఎస్‌సి అప్పీలు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

మెయిన్స్ పరీక్షల కరెక్షన్ సరిగ్గా లేదని, పరీక్ష కేంద్రంలోనూ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ.. టిజిపిఎస్‌సి హైకోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News