Friday, December 20, 2024

మెయిన్స్ కు న్యాయపరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ ఈ నెల 21నుంచి యథావిధిగా నిర్వహించవచ్చని హై కోర్టు వెల్లడించింది సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు గ్రూప్-1 అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. అలాగే అప్పీల్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యా ఖ్యలు చేసింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని, కేవలం 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మం ది ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దు అయ్యిందని, పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశా లు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

2022లో జా రీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూ డా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయ వాదు లు కోర్టుకు వెల్లడించారు. గతంలో గ్రూప్-1 నియామ క పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్ రాశారని, టిజిపిఎస్‌సి వెలువరించిన తుది ’కీ’లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా ’కీ’ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టిజిపిఎస్‌సి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు వెల్లడించారు.

46కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు టిజిపిఎస్‌సి ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్–1 ప్రధాన పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. ఈ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ 8, రంగారెడ్డి 11, మేడ్చల్ జిల్లాలో 27 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఎగ్జామ్ హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, టిజిపిఎస్‌సి కార్యాలయ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, మధ్యాహ్నం 1.30గంటల తర్వాత కేంద్రంలోని అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం వరకు 90శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 20వ తేదీ వరకు అవకాశముందని టిజిపిఎస్‌సి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News