- Advertisement -
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు సెషన్స్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సెంటర్ లోకి అధికారులు అనుమతించడలేదు. పరీక్షలు సిసి కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,368 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 783 గ్రూప్ -2 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
- Advertisement -