Monday, January 6, 2025

గ్రూప్‌-3 హాల్‌ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఆదివారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మొత్తం 3 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇక, 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-3 పరీక్ష జరగనుంది.  కాగా, తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News