Saturday, December 21, 2024

కార్తీక పౌర్ణమి స్పెషల్..ఆరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్‌టిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివ భక్తులు దేశంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా.. అరుణాచలం వెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణలు తప్పకుండా చేస్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త అందించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ఆర్‌టిసి యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని ఆర్‌టిసి సంస్థ కల్పిస్తోంది.

ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. కాగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టిజిఎస్‌ఆర్‌టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించవచ్చని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News