ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవలను ఆర్టిసి మరింతగా విస్తరిస్తోందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగా రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైదరాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఆర్టిసి లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని ఆర్టిసి అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!
0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
-1.01 నుంచి 5 కేజీలకు రూ.60
-5.01 నుంచి 10 కేజీలకు రూ.65
-10.1 నుంచి 20 కేజీలకు రూ.70
-20.1 నుంచి 30 కేజీలకు రూ.75
-30.1 కేజీలు దాటితే పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి. –