Sunday, December 22, 2024

గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడుకు టిజిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి భక్తులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, , ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు ప్రత్యేక బస్సులను టిజిఎస్ ఆర్‌టిసి ఏర్పాటు చేసింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. నాలుగు రోజుల ఈ ప్యాకేజీలో భాగంగా కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించేందుకు తెలంగాణ ఆర్‌టిసి సౌకర్యాన్ని కల్పించింది. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలంగాణ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News