Monday, January 20, 2025

టిజిఎస్ ఆర్టీసి ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్, వరంగల్‌లోని టిజిఎస్ ఆర్టీసి ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌ల్లో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti. telangana. gov.in/)  లో  దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసి సూచించింది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది.

నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసి అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌ల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టిజిఎస్ ఆర్టీసి డిపోల్లో అప్రెంటీషిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐటిఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటిఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటిఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611లను సంప్రదించాలని, పూర్తి వివరాలను https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోనూ చూడాలని టిజిఎస్ ఆర్టీసి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News