వనపర్తి జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే,..ఖిల్లా ఘణపురం మండల విద్యుత్ శాఖ ఏఈగా పనిచేస్తున్న కొండయ్య మల్కాపూర్ గ్రామంలోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్‌కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించేందుకు కాంట్రాక్టర్‌ను రూ.40వేలు డిమాండ్ చేశాడు. కంపెనీకి సంబంధించి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ.10 వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వనపర్తి డిఈ కార్యాలయంలో ఏఈ బుధవారం లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి అతడి నుండి డబ్బులు స్వాధీనపర్చుకొని , వేలిముద్రులు తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగిన ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎసిబి వలలో విద్యుత్ ఎఇ
- Advertisement -
- Advertisement -
- Advertisement -