Sunday, March 30, 2025

ఎసిబి వలలో జీడిమెట్ల ట్రాన్స్‌కో ఏఈ

- Advertisement -
- Advertisement -

ప్రజలను డబ్బుల కోసం పీడిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న అవినీతి అధికారులను ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తూ కటకటాల్లోకి నెడుతున్నా వారి తీరు మారడం లేదు. ఎసిబి అధికారులు దాడుల్లో మరో విద్యుత్ శాఖ అవినీతి అధికారి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే…. జీడిమెట్ల డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ ఏఈ ఎస్ సురేందర్ రెడ్డి దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్‌లో పని చేస్తున్నాడు. దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తి కి సంబంధించిన 11 కెవి లైన్ షిఫ్టింగ్ కోసం ఎస్టీమేషన్ వేసేందుకు 30 వేలు రూపాయల లంచం ఆశించడంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో గురువారం 2:45 నిమిషాలకు అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ యూనిట్-2 డిఎస్పీ పి.శ్రీధర్

నేతృత్వంలో డి.పోచంపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ఎసిబి అధికారులు బాధితుని దగ్గర నుండి 30 వేలు లంచం తీసుకొని కుడి చేతి ద్వారా ప్యాంట్ జేబులో పెట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు ఏఈ సురేందర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్‌లో విధులు నిర్వహిస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతనిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ నిమిత్తం నాంపల్లి ఎసిబి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఎసిబి అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం రహస్యంగా ఉంచుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News