Saturday, March 29, 2025

ఐపిఎల్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఆర్టిసి కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభమై.. మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. తమ అభిమాన జట్లకు సపోర్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ స్టేడియంలో సందడి చేస్తున్నారు. అలా స్టేడియంకు వెళ్లే ఫ్యాన్స్‌ కోసం ఆర్టిసి శుభవార్త అందించింది. ఐపిఎల్‌కి వచ్చే ఫ్యాన్స్‌కి ఇబ్బందులు కలుగకుండా గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనున్నారు. ఉప్పల్‌లో ఐపిఎల్ మ్యాచులు జరిగే తేదీల్లో అంటే మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే10, మే 20, మే 21 తేదీల్లో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News