- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు పంపింది. టిజిఎస్‌ఆర్‌టిసిలో ఖాళీగా ఉన్న 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), డిఎం, ఎటిఎం, మెకానికల్ ఇంజినీర్ 40, అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ విభాగంలో 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో 11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
- Advertisement -