Sunday, December 22, 2024

కురుమూర్తి స్వామి జాతరకు టిజిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టిజిఎస్‌ఆర్‌టిసి నడుపుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8న ఉండగా, 7 నుంచి 9 వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఆర్‌టిసి సంస్థ అందుబాటులో ఉంచుతోంది.

ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు బస్సులు బయలుదేరి వెళతాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం టిజిఎస్‌ఆర్‌టిసి అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆర్టీసి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News