Wednesday, January 22, 2025

థార్ మార్ థక్కర్ మార్

- Advertisement -
- Advertisement -

Thaar Maar Thakkar Maar song promo out

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి చేతులు కలిపారు. అంతకంటే ముందు వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌లతో మెగా మాస్ ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైంది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా వుంది. వీరిద్దరి మాస్ కెమిస్ట్రీ మైమరపించింది. ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్‌ని మరింత పెంచింది. తమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ని కంపోజ్ చేయగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ మూమెంట్స్ మెగా మాస్ జాతర సృష్టించాయి. హుక్ స్టెప్ ఖచ్చితంగా మాస్‌ను అలరిస్తోంది. భారీ సెట్‌లో ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటని ఆలపించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సెప్టెంబర్ 15న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Thaar Maar Thakkar Maar song promo out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News