Monday, November 18, 2024

థాయ్‌లాండ్ ప్రధాని పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు!

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్‌ఓచా సోమవారం పార్లమెంటును రద్దు చేశారు. మాజీ తిరుగుబాటు నాయకుడు సైన్యం మద్దతుగల పాలనను పొడిగించాలని కోరుతున్నందున మేలో సాధారణ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అంతగా ఆదరణలేని మాజీ ఆర్మీ చీఫ్ ప్రయుత్ 2014లో అధికారంలోకి వచ్చారు. నాడు బిలియనీర్ మాజీ ప్రధానమంత్రి షినవత్రా కుమార్తెకు వ్యతిరేకంగా ఓటువేయబడింది. దశాబ్దానికి పైగా ప్రవాసంలో ఉన్నప్పటికీ ఆమె నీడ ఇప్పటికీ థాయ్‌లాండ్‌పై ఉంది. పెటోంగ్‌టార్న్ షినవత్రా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన ఫ్యూథాయ్ సమూహం బలంగా పోటీపడుతోంది. కానీ థాయ్‌లాండ్‌లోని సైనిక పాలకుల(జుంటా) రచించిన రాజ్యాంగం ఆమెకు సర్వోన్నత పదవిని పొందడంలో అడ్డుపడుతోంది.

ఈ ఎన్నికలు 2014 తిరుగుబాటు తర్వాత రెండోది. 2020లో బ్యాంకాక్‌లో యువత నేతృత్వంలోని భారీ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలతో దేశం అతలాకుతలమైన తర్వాత ఇదే మొదటి ఎన్నిక. సైన్యం 2017లో రూపొందించిన రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రిని 500 మంది దిగువసభ ఎంపీలు, 250 మంది సైన్యం నియమించిన సెనేటర్లు ఎన్నుకుంటారు. ‘మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న నమ్మకం నాకుంది’ అని పెటోంగ్‌టార్న్ శుక్రవారం ఓ ర్యాలీలో విలేకరులతో అన్నారు. ఒకవేళ ఆమె విజయవంతమైతే తన తండ్రి, సోదరి యింగ్లక్ తర్వాత షీనావత్రా మూడో ప్రధాని అవుతుంది. ఆమెను ప్రయుత్ తిరుగుబాటు ద్వారా తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News