Monday, December 23, 2024

వార్న్‌ది సహజ మరణమే

- Advertisement -
- Advertisement -

Thai police say Shane Warne died of natural causes

బ్యాంకాక్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌ది సహజ మరణమేనని థాయిలాండ్ పోలీసులు వెల్లడించారు. సోమవారం వార్న్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. దీనిలో వార్న్‌ది సహజ మరణమేనని తేలింది. ఈ విషయాన్ని థాయిలాండ్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. ఇక వార్న్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు దానికి సంబంధించిన వివరాలను పోలీసులకు అందజేశారు. దీన్ని థాయిలాండ్ పోలీసులు వార్న్ కుటుంబ సభ్యులకు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపించారు. ఈ విషయన్నా థాయిలాండ్ పోలీస్ అధికారి కిస్సానా పథనాచెరోన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలావుండగా వార్న్ శుక్రవారం థాయిలాండ్‌లో తన రిసార్ట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, వార్న్ మరణించిన గదిలో రక్తం మరకలు కనిపించడంతో అతని మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అతనిది సహజ మరణమేనని తేలడంతో దీనిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News