Monday, December 23, 2024

థాయ్‌ల్యాండ్ నరమేధం.. సిఎన్‌ఎన్ బృందం కవరేజిపై పోలీస్ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Thailand genocide.. Police investigation on CNN team's coverage

యుధాయ్ సవన్ (థాయ్‌ల్యాండ్) : థాయ్‌ల్యాండ్ ఈశాన్య గ్రామీణ ప్రాంతంలో చిన్నపట్టణం యుధాయ్ సవన్ లోని డేకేర్ సెంటర్‌లో ఇటీవల దాదాపు 20 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో చిన్నారులపై నరమేధం జరిగింది. ఈ హత్యాకాండ జరిగిన తరువాత సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన బృందం కవరేజి కోసం ఆ డేకేర్ సెంటర్‌లో కి అక్రమంగా చొరబడ్డారన్న ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ సంఘటనపై నా క్లాంగ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని స్థానిక టౌన్‌షిప్ నిర్వహణ అధినేత డానైచోక్ బూన్‌సమ్ విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలో అనధికారికంగా ఆ బృందం ప్రవేశించారని ఆరోపించారు. సిఎన్‌ఎన్ బృందానికి చెందిన ఇద్దరు ఆ డేకేర్ భవనం వద్దకు వెళ్లి ఆ ఆవరణ లోని గోడ ఎక్కి ఒకరు కంచె దాటడం, మరొకరు బయట ఉండటం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. థాయ్ విలేకరి ఒకరు ఈ దృశ్యాన్ని వైరల్ చేశారు.

దీంతో అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే సిఎన్‌ఎన్ దీనిపై వివరణ ఇచ్చింది. ఆ సెంటర్ వద్ద పోలీస్ గస్తీ లేనప్పుడే బృందం భవనం లోపలికి ప్రవేశించిందని, అక్కడి ప్రజారోగ్య అధికారులు ముగ్గురు లోపల చిత్రీకరించుకోవచ్చని ప్రేరేపించారని పేర్కొంది. సెంటర్‌లో దాదాపు 15 నిమిషాల సేపు బృందం ఫుటేజీని చిత్రీకరించి బయటపడ్డారని సిఎన్‌ఎన్ ట్వీట్ చేసింది. ఆ సమయంలో పోలీస్ గస్తీ మళ్లీ అక్కడ ఏర్పాటు కావడంతో సిఎన్‌ఎన్ బృందం కంచె దాటుకుని బయటపడాల్సి వచ్చిందని సిఎన్‌ఎస్ వివరించింది.

థాయ్‌ల్యాండ్ లోని ఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ విమర్శించడంపై సిఎన్‌ఎన్ ట్వీట్ ద్వారా వివరించింది. సిఎన్‌ఎన్ బృందం ఈ విధంగా చేయడం జర్నలిజనం నైతిక విలువలకు భంగకరమని, వృత్తిధర్మానికి విరుద్ధమని, ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ తీవ్రంగా గర్హించింది. ఆ డేకేర్ సెంటర్‌లో గురువారం 36 మందిని మాజీ పోలీస్ అధికారి తుపాకీతో కాల్చి చంపాడు. తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. ఈ 36 మందిలో 24 మంది పిల్లలు. ఈ దాడి అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. ఆదివారం కొద్దిమంది తప్ప మిగతా మీడియాకు చెందిన వారు భారీ సంఖ్యలో ఆ డేకేర్ సెంటర్ నుంచి రిపోర్టు చేయడం కనిపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News