Thursday, January 23, 2025

సెమీ ఫైనల్‌కు సింధు

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు థాయిలాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం చిరకాల ప్రత్యర్థి అకానె యమగూచి(జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు విజయం సాధించి ముందంజ వేసింది. అసాధారణ ఆటను కనబరిచిన సింధు 2115, 2022, 2113 తేడాతో టాప్ సీడ్ యమగూచిని ఓడించింది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. దూకుడుగా ఆడుతూ అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి యమగూచి సర్వం ఒడ్డి పోరాడింది. సింధు కూడా పోరాట పటిమను కనబరచడంతో సెట్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి వరకు పట్టును నిలబెట్టుకున్న యమగూచి సెట్‌ను దక్కించుకుంది. మరోవైపు ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో సింధు పుంజుకుంది. నిలకడైన ఆటతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

Thailand Open 2022: PV Sindhu enters to Semifinals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News