Wednesday, December 18, 2024

కోలీవుడ్ స్టార్ విజయ్ రికార్డు..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ విజయ్ యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్ హారోకి ఫేస్‌బుక్‌లో 78లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ట్విటర్లో 44లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో విజయ్ అంత చురుకుగా ఉండరు. చాలా తక్కువగా పోస్ట్లు పెడుతుంటారు. కొత్త సినిమాలు ప్రకటించినప్పుడు, రిలీజ్ డేట్ సమయంలో మాత్రమే పోస్ట్లను షేర్ చేస్తుంటారు. విజయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

లియో సినిమాకు సంబంధించిన పోస్ట్ చేశారు. కశ్మీర్ లోకేషన్లో విజయ్ తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఇన్ స్టా ఎంట్రీతోనే విజయ్ రికార్డు సృష్టించారు. సోషల్ మీడియాలో అకౌంట్‌ను ఓపెన్ చేసిన రెండు గంటల్లోపే ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య 13 లక్షలకు చేరుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News