Sunday, December 22, 2024

క్రేజీ మూవీ షూటింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ మంగళవారం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళని సామి సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం. అక్టోబర్ 19న లియో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News