పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ’బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ’మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో థమన్ ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ “బ్రో సినిమా ఎంతోమందిని కదిలిస్తుంది.
ఇందులో హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అద్భుతంగా ఉంటా యి. త్రివిక్రమ్ రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా ‘బ్రో’ శ్లోకం స్వరపరిచాం. నేపథ్య సంగీతం పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాల ను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్‌లో ఒక మాంజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు”అని తెలిపారు.
Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ