Saturday, January 25, 2025

‘గాడ్ ఫాదర్’ బ్లాక్‌బస్టర్‌తో ఆ సెంటిమెంట్ కొనసాగినట్లయింది

- Advertisement -
- Advertisement -

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ’గాడ్ ఫాదర్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు తమన్ మీడియాతో మాట్లాడుతూ “గాడ్‌ఫాదర్ ఘన విజయం సాధించడంతో చాలా ఆనందంగా వుంది. నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ వుంది. నేను తొలిసారి కలసి పని చేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి.

మహేష్ బాబుతో దూకుడు, రవితేజతో కిక్, ఎన్టీఆర్‌తో బృందావనం, పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్, బాలకృష్ణతో అఖండ.. ఇలా అన్నీ బ్లాక్‌బస్టర్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో నేను చేసిన తొలి సినిమా గాడ్ ఫాదర్ కూడా బ్లాక్‌బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం. మ్యూజిక్‌కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్ గా హైప్ తీసుకురావడం ఒక పెద్ద సవాల్. సినిమా చూసిన ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది”అని అన్నారు.

Thaman About GodFather’s Music

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News