యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సెన్సేషనల్ హిట్ అయింది. ఇటీవల రిలీజైన సెకండ్ సింగిల్ ‘నమో నమః శివాయ’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘తండేల్’ థర్డ్ సింగిల్ బ్లాక్‌బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా ఈనెల 23న రిలీజ్ కానుంది. సముద్ర తీరంలో రగ్గడ్ లుక్‌లో లవ్లీ స్మైల్‌తో నిలుచున్న నాగచైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్ గా డ్యాన్స్ చేస్తూ సాయి పల్లవి కనిపించిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తండేల్ నుంచి ‘హైలెస్సో హైలెస్సా..’ వచ్చేస్తోంది
- Advertisement -
- Advertisement -
- Advertisement -