Wednesday, January 22, 2025

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో ‘తండేల్’.. గ్రాండ్గా లాంచ్

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ తో తెరకెక్కతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్’. ఈ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ గా నిర్వహించారు.

Thandel Movie Pooja Ceremony at Annapurna Studios

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున వచ్చి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సిినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యాక్రమంలో నాగచైతన్యతోపాటు సాయిపల్లవి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 15 తర్వాత నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్ప‌టికే విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ మూవీపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News