Friday, January 17, 2025

‘బుజ్జి తల్లి..’ పాట వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శ కుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రొమాం టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అల రించేందుకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సిని మాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

బ్లాక్‌బస్టర్ హిట్ ‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడిని మరోసారి తెరపై చూడటా నికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తండేల్’ మేకర్స్ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘బుజ్జి తల్లి’ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నెలలో మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ సాంగ్ మరో రెండు వారాల్లో ఎప్పుడైనా రావచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిని మాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News