Thursday, September 19, 2024

మ్యూజిక్ ఒక మేజర్ హైలెట్‌గా…

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా ’తండేల్’ టీం ఆయనకు విషెస్ తెలియజేసింది. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు… దేవిశ్రీని కలిసి బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

’తండేల్’లో మ్యూజిక్ ఒక మేజర్ హైలెట్‌గా వుండబోతుంది. సినిమా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కంపోజర్ చేశారు దేవిశ్రీ. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెన్సేషనల్‌గా వుండబోతున్నాయి. త్వరలోనే మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ‘తండేల్’లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామర్ అవతార్‌లలో కనిపిస్తారు. మాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, లోకల్ స్లాంగ్ సరిగ్గా ఉండేలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News