Sunday, December 22, 2024

అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ..

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ కీలక సుదీర్ఘమైన షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమవుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి చాలా సహజ సిద్ధంగా కనిపించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్‌లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుంది. యదార్థ సంఘటనల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News