Thursday, January 23, 2025

డ్రగ్స్ మత్తులో కత్తితో పొడిచి కన్నతల్లినే చంపేసిన బాడీబిల్డర్

- Advertisement -
- Advertisement -

 

థాణె: మహారాష్ట్రలోని థాణె నగరంలో డ్రగ్స్ మత్తులో ఒక 31 ఏళ్ల వ్యక్తి కన్నతల్లినే కత్తితోపొడిచి హత్యచేశాడు. తండ్రిని కూడా కత్తితో పొడవగా తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు చేతిలో కత్తిపోట్లకు గురైన వినితా భట్కర్(66) అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త విలాస్ భట్కర్(72) తీవ్ర గాయాలతో వేదాంత్ ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నాడరని పోలీసు అధికారులు తెలిపారు.

Also Read: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంజనీర్ మృతి

సంకల్ప్ భట్కర్(31) గురువారం ఉదయం తన తల్లిదండ్రులను కత్తితో పొడిచాడని, తల్లి వినితా భట్కర్ మరణించగా తండ్రి విలాస్ భట్కర్ తీవ్రంగా గాయపడ్డారని కసర్‌వాడ్‌వలి పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ బాబ్‌షెట్టి శుక్రవారం తెలిపారు. నిందితుడు ంకల్ప్ బాడీ బిల్లర్ అని, అతను స్టెరాయిడ్స్ తీసుకుంటాడని ఆ ఇంటి పక్కన నివసించే వారు తెలిపినట్లు పోలీసు అధికారి చెప్పారు. నిత్యం డ్రగ్స్ పుచ్చుకుని మత్తులో ఉండే సంకల్ప్‌కు 3 నెలల క్రితం వివాహమైందని, అప్పటి నుంచి తల్లిదండ్రులతో అతని సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. స్టెరాయిడ్స్ విషయంలో అతడికి తల్లిదండ్రులతో గొడవలు అయ్యేవని, డ్రగ్స్ పుచ్చుకోవడం మానెయ్యమని తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా అతను వినేవాడు కాదని ఆయన చెప్పారు.

గురువారం ఉదయం ఉల్లిపాయలు కోసే కట్టర్‌తో తల్లిదండ్రులను పొడిచి, రక్తపు మరకలు ఉన్న కట్టర్‌ను చేతిలో పట్టుకుని తనసోదరి నివసించే ఘోడ్‌బందర్ రోడ్డులోని కోరల్ హైట్స్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సోదరిని కూడా చంపే ఉద్దేశంతో ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లిన సంకల్ప్ అక్కడ ఆమె లేకపోవడంతో వెనుదిరిగాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. తన అత్తమామలు నివసించే కుర్లా నెహ్రూ నగర్‌కు బైకులో బయల్దేరిన సంకల్ప్ అక్కడకు చేరుకునేలోగా పోలీసులు సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలు చూసిన సంకల్ప్ అత్తమామలు తలుపులు అప్రమత్తమయ్యారని, సంకల్ప్ తలుపులు కొట్టినా తీయలేదని ఆయన చెప్పారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని సంకల్ప్‌ను అరెస్టు చేశారని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News