Wednesday, January 22, 2025

‘తంగలాన్’ గొప్ప మూవీ: జీవీ ప్రకాష్

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ‘తంగలాన్‘ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ‘తంగలాన్‘ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ చేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “తంగలాన్ ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు రెండు, మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటంతో ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సవాలుగా మారింది. అయినా పర్పెక్ట్ ఔట్‌పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా రంజిత్ తన విజన్‌ను నాకు చెప్పాడు. ఆయన విజన్ ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ చేశాను. సంగీత దర్శకుడిగా ‘తంగలాన్‘కు వర్క్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

‘తంగలాన్‘ టైటిల్ సాంగ్, మనకి మనకి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. – దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. – విక్రమ్ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్‌గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ‘తంగలాన్‘ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News