Monday, December 23, 2024

100 కోట్ల చేరువలో ‘తంగలాన్’

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్ లో 26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా ఈ సినిమా సెకండ్ వీక్ లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్‌కు చేరువైంది.

ఈ నెల 30న నార్త్‌లో ‘తంగలాన్‘ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రెండో వారంలో ‘తంగలాన్’ సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. ‘తంగలాన్’ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ‘తంగలాన్’ సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News