Wednesday, January 22, 2025

డిఫరెంట్ మూవీ ‘తంగలాన్’..(టీజర్)

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్‘. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్ ఫీల్డ్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

‘తంగలాన్‘ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ లో ‘తంగలాన్‘ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్, దర్శక నిర్మాత పా.రంజిత్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, హీరో సత్యదేవ్, డైరెక్టర్స్ బాబి, సురేందర్ రెడ్డి, కరుణ కుమార్, వేణు ఊడుగుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. తంగలాన్‌లో ఒక లైఫ్ ఉంటుంది. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశాను. ఆ క్యారెక్టర్స్ లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్ లో కనిపించాలంటే నేను హీరో బాడీతో ఉంటే ఎవరికీ నచ్చదు. అందుకే పాత్రకు తగ్గట్టు బాడీని మార్చుకున్నా”అని అన్నారు.

దర్శక నిర్మాత పా.రంజిత్ మాట్లాడుతూ “తంగలాన్ టీజర్‌లో మేము చూపించిన కంటెంట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సినిమా కూడా అలాగే మీకు నచ్చేలా ఉంటుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, విక్రమ్ లాంటి మూవీస్ సాధించిన విజయాలతో నార్త్ సినిమా మీద సౌత్ సినిమా పైచేయి సాధించింది. ఇక విక్రమ్‌తో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా”అని పేర్కొన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “తంగలాన్ మూవీతో ఫస్ట్‌టైమ్ విక్రమ్ మా స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో నటించడం హ్యాపీగా ఉంది. జనవరి 26న మన సినిమా లవర్స్ అంతా తంగలాన్‌ను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటాం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News