Saturday, December 21, 2024

తంజావూరు అగ్రి ఇన్‌స్టిట్యూట్‌కు స్వామినాథన్ పేరు : సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తంజావూరు లోని వ్యవసాయ కళాశాల పరిశోధన సంస్థ( అగ్రికల్చరల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్) కు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త , భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేరు పెడుతున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ప్రోపగేషన్, జెనిటిక్స్ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ తంజావూరు లోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా మారుస్తామని ప్రకటించారు. పద్మవిభూషణ్, మెగసెసే అవార్డులతోపాటు అనేక జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలతో గౌరవం పొందిన స్వామినాథన్‌ను గౌరవించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హరిత విప్లవానికి స్వామినాథన్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 28న ఎం.ఎస్. స్వామినాథన్ చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News