Tuesday, December 24, 2024

భారత అభినవ అంబేద్కర్ సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత అభినవ అంబేద్కర్, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కెసిఆర్ అని వక్తలు కొనియాడారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రజాసంఘాల జెఎసీ ఛైర్మన్ గజ్జలకాంతం, ప్రైవేట్ ఉద్యోగ సంఘం, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాద సభ జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, భారత రాష్ట్ర సమితి ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు ముఠాగోపాల్, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జలకాంతం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్, రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పూసల సంఘం అధ్యక్షులు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని వక్తలు కొనియాడారు. నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం, చేపట్టలేదని, ఇలాంటి గొప్ప ప్రభుత్వం కెసిఆర్ చేపట్టడం గమనార్హమని కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News